మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం అమోఘమైన కృషి చేస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆయన చేపపిల్లలను వదిలారు. మొదటి విడతలో 6.49 లక్షల చేపపిల్లలను విడుదల చేయగా.. ప్రస్తుతం రెండో విడతలో మరో 4.55 లక్షల చేపపిల్లలను విడుదల చేశామన్నారు. ఈ ప్రాంతంలోని చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరిందని.. చేపల ద్వారా మత్స్యకారులు ఉపాధి పొందాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జేసీ నిఖిల తదితరులు పాల్గొన్నారు.
నల్లవాగు ప్రాజెక్టులో మంత్రి తలసాని చేపపిల్లల విడుదల - mla bhupalreddy releases fishes in nallavagu project
సంగారెడ్డి జిల్లా నల్లవాగు ప్రాజెక్టులోకి 4.55 లక్షల చేపపిల్లలను రెండో విడతలో విడుదల చేసే కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

నల్లవాగు ప్రాజెక్టులో మంత్రి తలసాని చేపపిల్లల విడుదల
నల్లవాగు ప్రాజెక్టులో మంత్రి తలసాని చేపపిల్లల విడుదల