సంగారెడ్డి కలెక్టరేట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని అన్ని సెక్షన్‌లను కలియ తిరిగి పరిశీలించారు.
కలెక్టరేట్లో హరీశ్.. ఉద్యోగుల తీరుపై అసహనం - sangareddy district latest news
ప్రతి ఉద్యోగి సమయపాలన తప్పకుండా పాటించాలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చాలా మంది ఉద్యోగులు విధులకు సకాలంలో హాజరుకాకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
సమయపాలన తప్పక పాటించాలి: హరీశ్‌రావు
ఉదయం పదిన్నర అవుతున్నా.. చాలా మంది విధులకు హాజరు కాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి సమయపాలన తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌కు మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ