Harishrao: రాష్ట్రంలో ఇస్కాన్ సంస్థ అద్భుతమైన సేవలు అందిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయ పాత్ర ప్రాంగణంలో రాధకృష్ణ ఆలయం, హరే కృష్ణ సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అక్షయ పాత్ర ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తూ లక్షలాది మంది పేదల ఆకలి తీర్చుతున్నారని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎన్ని ఆస్తులు సంపాదించినా.. ఆ భగవంతుని సేవలోనే ఆనందం దొరుకుతుందని చెప్పారు. చట్టాలు, ప్రభుత్వాలు, పోలీసులు చేయించలేని పనిని ఆ భగవంతుని మీద ఉన్న భక్తి చేపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.
"ఆకలితో అలమటించే పేదవారికి ప్రతిరోజు 65వేల మందికి భోజనం అందిస్తున్నారు. ఎంతో ఉన్నతమైన ప్రమాణాలతో, సేవాభావంతో నాణ్యమైన భోజనం లక్షల మందికి అందిస్తున్నాం. సంపదను రేపటితరాలవారికి అందించాలనే ఉద్దేశంతో రాధకృష్ణ ఆలయం, హరే కృష్ణ సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేయడం ఆనందంగా ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్ని ఆస్తులు సంపాదించినా ఆ భగవంతుని సేవలోనే ఆనందం దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని ఆలవరుచుకోవాలి." -హరీశ్‌రావు ఆర్థిక శాఖ మంత్రి