మెట్రో రైలును.. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు కోరారు. బడ్జెట్ కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. 'మెట్రో రైలు సాధన కోసం' నినాదంతో.. పటాన్చెరు నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు పాదయాత్ర చేశారు.
'మెట్రో రైలును సంగారెడ్డి వరకూ పొడిగించండి' - పటాన్చెరు
'మెట్రో రైలు సాధన కోసం' నినాదంతో.. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు, పటాన్చెరు నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు పాదయాత్ర చేశారు. పారిశ్రామిక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని పటాన్చెరు వరుకు రైలును పొడిగించాలని డిమాండ్ చేశారు.
'మెట్రో రైలును సంగారెడ్డి వరకూ పొడిగించండి'
మెట్రో రైలు సాధన కోసం.. ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి అసెంబ్లీలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చుక్కా రాములు పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతం, జిల్లా కేంద్రాలను దృష్టిలో పెట్టుకుని రైలు తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు.. అన్ని వర్గాల వారికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని వివరించారు.