ఆదరణకు నోచుకోని వృద్ధులకు, మానసిక వికలాంగులకు చట్ట పరంగా తాము అండగా ఉంటామని ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సాయి రమాదేవి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో... వృద్ధులకు, మానసిక వికలాంగులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సాయి రమాదేవి, కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మానసిక వికలాంగులకు బట్టలు, ఆట వస్తువులను పంపిణీ చేశారు. జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ రక్త, కంటి, కీళ్లనొప్పుల పరీక్షలు ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. వృద్ధులు ప్రశాంత జీవితాన్ని గడపాలని.. వారికి ఎవరైనా హాని తలపెడితే చట్టపరంగా న్యాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. సమస్యలు ఉన్న వృద్ధులు జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించి... సత్వర న్యాయం పొందాలని జస్టిస్ సాయి రమాదేవి కోరారు.
వృద్ధులకు, మానసిక వికలాంగులకు అండగా...
సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో... వృద్ధులకు, మానసిక వికలాంగులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సాయి రమాదేవి, కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
MEDICAL CAMP FOR OLD MEN AND MENTALLY DISABLED
TAGGED:
ఉచిత వైద్య శిబిరం