సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని నాగూర్ గ్రామంలో రేపు జరగనున్న బాల్య వివాహాన్ని ముందస్తు సమాచారంతో ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని నాగూర్లో మైనర్ బాలికకు వివాహం చేస్తున్నారని తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు గ్రామానికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
వివాహం జరగబోయే అమ్మాయి వయసు 18 ఏళ్లు నిండలేదని అమ్మాయి తల్లిదండ్రులతో పాటు వరుడి తరపు వారందరికీ అవగాహన కల్పించారు. బాల్య వివాహం చేయడం వల్ల జరిగే అనర్థాలను వారికి వివరించారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
మైనరు బాలికకు పెళ్లేంటి? తల్లిదండ్రులకు ఐసీడీఎస్ కౌన్సిలింగ్ - ICDS OFFICERS
మైనరు బాలిక వివాహన్ని సంగారెడ్డి జిల్లాలో ఏకీకృత శిశు అభివృద్ధి శాఖ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేశారు.
బాల్యవివాహాలపై మాకు సమాచారం అందించండి : అధికారులు
ఇవీ చూడండి : సత్ఫలితాలిస్తున్న జైళ్ల శాఖ సంస్కరణలు