సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామచంద్రపురం మండలాల్లో 6 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. పటాన్చెరులో 28 రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారన్నారు. వారికి సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇక్కడున్న ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందకెళ్తుందని అన్నారు.
'సౌకర్యాలు అందించడమే లక్ష్యం' - patancheru
మినీ భారతంగా ఉన్న పటాన్చెరులో అన్ని రాష్ట్రాల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మహిపాల్ రెడ్డి