తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ చేస్తారు - sangareddy mla

కేసీఆర్ ప్రజలందరికీ సాగు, తాగు నీరు అందిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.

కేసీఆర్​ చేస్తారు

By

Published : Feb 24, 2019, 8:04 PM IST

జగ్గారెడ్డితో ఇష్టాగోష్ఠి
ప్రజలకు తాగు, సాగు నీరందించాలనే తన విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని నమ్ముతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హరీశ్​రావు అత్యుత్సహంతోనే సింగూరు జలాలను తరలించారని ఆరోపించారు. బడ్జెట్​ కేటాయిపులు రాష్ట్ర ప్రజలపై ఏవిధంగాప్రభావం చూపుతాయో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతారని తెలిపారు.

పార్లమెంటులో హస్తానిదే హవా

పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఉత్తమ్‌ ఒక్కడే బాధ్యుడు కాదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​ నుంచి బయటకు ఎవ్వరూ వెళ్లేదిలేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details