సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం పౌరులు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఉద్యోగులు పని చేస్తున్న కార్యాలయాలు సహా ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలన్నారు.
'నాటిన మొక్కలను సంరక్షించకపోవటం నేరం'
నాటిన మొక్కలను సంరక్షించకపోవటం నేరమని జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటితే వర్షాలు కూడా కురుస్తాయని తెలిపారు.
'నాటిన మొక్కలను సంరక్షించకపోవటం నేరం'
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటితే వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయన్నారు. కార్యక్రమాల్లో మొక్కలు నాటిన అనంతరం సంరక్షణ మర్చిపోవడం తీవ్ర నేరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజకుమారి వీర అర్జున్ రెడ్డి, మండల న్యాయ సేవా అధికార సంస్థ టైపిస్టు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.