రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి. నాగిరెడ్డి మంగళవారం పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి రోజు నామినేషన్లు జోరుగా సాగాయి.
మెదక్ జిల్లాలో మొత్తం నాలుగు పురపాలక సంఘాలు ఉండగా.. మొదటి రోజు 42 నామినేషన్లు దాఖలయ్యాయి. గరిష్ఠంగా నర్సాపూర్‌లో 21, కనిష్ఠంగా రామాయంపేటలో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా పట్టణాల వారీగా.. మెదక్‌లో 14, రామాయంపేటలో 2, నర్సాపూర్‌లో 21, తూప్రాన్‌లో 5 నామినేషన్లు దాఖలయ్యాయి.
సిద్దిపేటలో...
సిద్దిపేట జిల్లాలో మొత్తం 5 పురపాలక సంఘాలు ఉండగా.. సిద్దిపేట పాలక మండలి గడువు ఉండటం వల్ల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మిగిలిన నాలుగు పట్టణాల్లో మొదటి రోజు 32 నామినేషన్లు దాఖలు చేశారు. గరిష్ఠంగా హుస్నాబాద్‌లో 17, కనిష్ఠంగా గజ్వేల్‌లో 3 నామినేషన్లు వేశారు. ఆయా పట్టణాల వారీగా.. హుస్నాబాద్‌లో 17, చేర్యాలలో 4, దుబ్బాకలో 8, గజ్వేల్‌లో 3 నామినేషన్లు దాఖలయ్యాయి.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 పురపాలక సంఘాలు ఉండగా.. కోర్టులో కేసు ఉండటం వల్ల జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. మిగిలిన 7 పట్టణాల్లో మొదటి రోజు మొత్తం 91 నామినేషన్లు దాఖలు చేశారు. గరిష్ఠంగా సంగారెడ్డిలో 27, కనిష్ఠంగా నారాయణఖేడ్‌లో 1 నామినేషన్ వేశారు. ఆయా పట్టణాల వారీగా.. అమీన్పూర్లో 20, ఐడీఏ బొల్లారంలో 9, తెల్లాపూర్‌లో 4, సంగారెడ్డిలో 27, సదాశివపేటలో 20, ఆందోల్-జోగిపేటలో 10, నారాయణఖేడ్‌లో 1 నామినేషన్ దాఖలయ్యాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగిన నామినేషన్లు ఇదీ చూడండి : 'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'