పోరాడి సాధించుకున్న తెలంగాణలో అంటరానితనం, కుల వివక్షను నిర్మూలించడానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రయత్నిస్తోందని కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కోన్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే ఆదర్శంగా పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. తాము పదవి చేపట్టే నాటికి 10,500 కేసులు పెండింగ్లో ఉండగా.. సెప్టెంబర్ 20 వరకు 8,000 కేసులను పరిష్కరించామని తెలిపారు. రూ.56.60 కోట్లను బాధితులకు పరిహారంగా అందించామన్నారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలో ఆయన జన అదాలత్ నిర్వహించారు.
'బాధితులకు గడప దగ్గరే న్యాయం అందిచాలన్న లక్ష్యంతో..' - telangana news
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే ఆదర్శంగా పని చేస్తోందని కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. నవంబర్ 30 నాటికి 8,600 గ్రామ పంచాయతీల్లో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించామని.. అధికారులకు, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించామని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 20 నాటికి 8,000 కేసులను పరిష్కరించి.. రూ.56.60 కోట్లను బాధితులకు పరిహారంగా అందించామన్నారు.
నవంబర్ 30నాటికి 8,600 గ్రామ పంచాయతీల్లో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి.. అధికారులకు, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు గడప దగ్గరే న్యాయం అందిచాలన్న ఉద్దేశంతో జన అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్లో నిర్వహించిన జన ఆదాలత్కు మంచి స్పందన వచ్చిందని శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చూడండి:భూసేకరణలో జాప్యం వల్లే పనుల్లో ఆలస్యం: కిషన్ రెడ్డి