తెలంగాణ

telangana

ETV Bharat / state

నామినేషన్​ వేసిన బీబీ పాటిల్​ - bb patil

జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి తెరాస అభ్యర్థిగా బీబీ పాటిల్​ నామినేషన్​ వేశారు.  సంగారెడ్డి జిల్లా ఎన్నికల  రిటర్నింగ్ అధికారి హనుమంతరావుకి నామపత్రాలు అందజేశారు.

జహీరాబాద్​లో గెలుపుపై తెరాస ధీమా

By

Published : Mar 25, 2019, 3:24 PM IST

జహీరాబాద్​లో గెలుపుపై తెరాస ధీమా
నేటితో గడువు ముగుస్తున్నందున అధికసంఖ్యలో నేతలు నామినేషన్లు సమర్పిస్తున్నారు. తెరాస ఎంపీ అభ్యర్థిగా జహీరాబాద్​ పార్లమెంటు స్థానానికి బీబీ పాటిల్​ నామినేషన్​ వేశారు. సంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్​ అధికారికి నామపత్రాలు అందించారు.

గెలుపుపై ధీమా

రిటర్నింగ్​ అధికారి ఆయనతో నామపత్రం దాఖలు చేస్తున్నట్లు ప్రమాణం చేయించారు. బీబీ పాటిల్​ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంప గోవర్దన్, హన్మంత్ షిండే వచ్చారు. జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని తెరాస భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందని పాటిల్​ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:తలసాని కుమారుడి భారీ నామినేషన్ ర్యాలీ​

ABOUT THE AUTHOR

...view details