కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాయని సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ మండిపడ్డారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి స్థానిక ఆర్డీవో కార్యాలయం వరకు ఎడ్లబండిపై గ్యాస్ సిలిండర్, ద్విచక్ర వాహనాలను పెట్టి తిప్పుతూ వినూత్న నిరసన చేపట్టారు.
కేంద్రం కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయిందని మహేందర్ ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలు ఏ నిర్ణయం తీసుకున్నా.. కేంద్రం దాన్ని గుడ్డిగా అమలు పరుస్తోందంటూ విమర్శించారు.