తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2020, 4:39 PM IST

ETV Bharat / state

అమానవీయం: రాత్రంతా వర్షంలోనే కరోనా రోగి మృతదేహం

మనం పోరాడాల్సింది కొవిడ్​ వ్యాధితో గాని... రోగితో కాదని వైరస్​ గురించి ఎంతలా అవగాహన కల్పిస్తున్నా.. ప్రాణ భయంతోనో... అవగాహన లోపంతోనే కరోనా రోగులకు అవమాన ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. బతికుండగానే మనుషుల్లా చూడడం లేదు.. చివరకు చనిపోయినా కనికరం కానరావడం లేదు.

అమానవీయం: రాత్రంతా వర్షంలోనే కరోనా రోగి మృతదేహం
అమానవీయం: రాత్రంతా వర్షంలోనే కరోనా రోగి మృతదేహం

కరోనా మానవ సంబంధాలు ఎంత బలహీనంగా ఉన్నాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. సొంత వారే పరాయి వాళ్లుగా మారిపోతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొవిడ్​ వ్యాపించే అవకాశాలు తక్కువే అని నిపుణులు ఎంత చెప్పినా ప్రజల్లో అవగాహన రావడం లేదు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో అవమానవీయ ఘటన చోటుచేసుకొంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వర్షంలోనే పడేశారు. కొవిడ్​తో బాధపడుతున్న వ్యక్తి బుధవారం రాత్రి సమయంలో ఇంట్లోని సోపాలోనే ప్రాణం వదిలాడు. కుటుంబసభ్యులు మృతదేహాన్ని బయట ఉంచారు. గురువారం అతడి తల్లి కూడా మరణించింది. సమయం గడుస్తున్నా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. కుటుంబసభ్యులు, బంధువులు భయంతో దగ్గరకు రాలేదు. చివరకు సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇదీ చూడండి:నిస్సహాయ స్థితిలో నిండు చూలాలు....

ABOUT THE AUTHOR

...view details