విధి ఆడిన వింతనాటకం.. భిక్షమెత్తితేనే పట్టెడన్నం!పేరుతో ఈటీవీ భారత్‌లో ప్రచురితమైన కథనానంపై దాతలు స్పందించారు. విద్యుదాఘాతంతో 2 కాళ్లు, ఒక చేయి పోగొట్టుకుని... భిక్షాటన చేస్తున్న సంగారెడ్డి జిల్లా మల్లేపల్లికి చెందిన వెంకటేష్‌కు... పలువురు అండగా నిలిచారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. బాధితుడికి అండగా నిలిచిన దాతలు - వికలాంగుడు వెంకటేశ్ కుటుంబానికి ఆర్థిక సాయం
ఈటీవీ భారత్‌లో ప్రసారమైన దివ్యాంగుడి వ్యథను చూసి పలువురు స్పందించారు. 'విధి ఆడిన వింతనాటకం.. భిక్షమెత్తితేనే పట్టెడన్నం!' పేరుతో ప్రచురితమైన కథనంపై స్పందించిన అమెరికాకు చెందిన "హోప్ ఫర్ స్పందన సంస్థ"... బాధితుడికి ఉపాధి కల్పనకు కిరాణా దుకాణం తెరిపించింది.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. బాధితుడికి అండగా నిలిచిన దాతలు
అమెరికాకు చెందిన హోప్ ఫర్ స్పందన సంస్థ... వెంకటేష్ ఉపాధి కల్పనకు కిరాణా దుకాణం తెరిపించింది. భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని సంస్థ సమన్వయ కర్త లక్ష్మీ నర్సింహం హమీ ఇచ్చారు. తన పరిస్థితిని ప్రపంచానికి చూపిన ఈటీవీ భారత్‌కు, దాతలకు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపాడు.
ఇదీ చూడండి:విధి ఆడిన వింతనాటకం.. భిక్షమెత్తితేనే పట్టెడన్నం!