సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామపంచాయతీ, వార్డు కమిటీ సభ్యులు అక్రమ నిర్మాణాలు చేపట్టారని సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి వాటిని కూల్చివేశారు. పెద్ద చెరువు కాలువపై ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో నేలమట్టం చేశారు.
చిట్కుల్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఆగ్రహం - అక్రమ కట్టడాలు
సంగారెడ్డి జిల్లా చిట్కుల్ గ్రామ పరిధిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ నిర్మాణాలకు కారణమైన గ్రామపంచాయతీ, వార్డు కమిటీ సభ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
చిట్కుల్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఆగ్రహం
వార్డు కమిటీ సభ్యులు ఈ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారని వారిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తహసీల్దార్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టిన కూల్చి వేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: మత్తులోకి దించి.. మట్టుబెడతాడు