సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారంలో శేఖర్ అనే వ్యక్తి మద్యం సేవించి రాత్రి ఇంటికి వెళ్లాడు. ఆ మత్తులో భార్యతో వాగ్వాదానికి దిగాడు. గొడవ ముదరగా... విచక్షణ కోల్పోయిన శేఖర్ భార్య శివలీలపై కర్రతో దాడి చేశాడు. అప్పటికి బాగానే ఉన్న ఆమె నిద్రలో తుదిశ్వాస విడిచింది. భర్త కర్రతో కణతపై కొట్టడం వల్లే మృతి చెందిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శేఖర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో భార్యపై భర్త దాడి... నిద్రలో మృతి - murder
తప్ప తాగి తూలుతూ ఇంటికి వచ్చిన భర్తను భార్య మందలించింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి భార్యతో గొడవపడ్డాడో ప్రబుద్ధుడు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయి కర్రతో దాడి చేయగా.. ఆమె మృతి చెందింది.
మద్యం మత్తులో భార్యపై భర్త దాడి... నిద్రలో మృతి