విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు వినూత్న పంథా ఎంచుకున్నాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పాఠ్యాంశాలను మైకు (లౌడ్ స్పీకర్)లో బోధిస్తూ పిల్లలను బడి వైపు ఆకర్షిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో 61 మంది విద్యార్థులుండగా.. కరోనా నేపథ్యంలో తల్లిదండ్రులు విద్యార్థులను బడులకు పంపడం లేదు.
అల్లాపూర్‌లో చాలా కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడినవే. విద్యార్థులను బడులకు పంపే ధైర్యం ఆ తల్లిదండ్రలకు లేదు. అలాగని స్మార్ట్‌ఫోన్లు కొనిపించి, పాఠాలు వినిపించే స్థోమతా.. వారికి లేదు. అలాంటి వారు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో.. స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నీలి లక్ష్మణ్ ఈ వినూత్న ఆలోచన చేశారు.