Deliveries In Govt Hospitals: కాన్పు కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే వేలల్లో ఖర్చుతో పాటు సిజేరియన్ చేయడానికే ఎక్కువగా వైద్యులు ప్రాధాన్యమిస్తారు. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సేవలు అందుతుండటంతోపాటు సాధారణ ప్రసవాలుచేసేలా వైద్యులు, సిబ్బంది చొరవ చూపుతుండటంతో దవాఖాలకు వచ్చే గర్భిణీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నారు. మిడ్‌వైఫ్ విధానం అమలుతో పాటు ప్రసవాలకు వచ్చే మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణీలకు మిడ్‌వైఫ్‌లు ఇస్తున్న సలహాలు, వారికి అందుతున్న చికిత్సతో దూరప్రాంతాల నుంచి సాధారణ ప్రసవాలకు కరీంనగర్ ఆసుపత్రికి తరలి వస్తున్నారు.
వైద్యుల ప్రత్యేక శ్రద్ధ
ప్రసవాలకు వచ్చే మహిళలకు ముందుగా ఉన్న అపోహలను తొలగించడమే కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నట్లు మిడ్‌వైఫ్ సిబ్బంది తెలిపారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు పాటిస్తూ మహిళల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యమని వైద్యులు చెబుతున్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో పెరుగుతున్న సంఖ్య సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ అధిక ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణుల ఆరోగ్యంపై వైద్యో సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండటంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో దాదాపు 35 శాతానికి పైగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. సాధారణ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామాల్లోని ఆశా కార్యకర్తలు గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కలిగిస్తున్నారు. క్రమం తప్పకుండా పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లేలా సిబ్బంది కృషిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం ప్రసవాల్లో డెబ్భై శాతానికి పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సంగారెడ్డి తెలిపారు. గ్రామస్థాయిలో ఆశా కార్యకర్తలు గర్భిణి కుటుంబంలోని వారికి అవగాహన కల్పించటంతో పాటు సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుండటం సత్ఫలితాలను ఇస్తోందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: