సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు సర్కిల్‌లో బల్దియా పోరు రసవత్తరంగా సాగుతోంది. 600 మంది సిబ్బందితో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు జరుగుతున్నా... వెంటనే తాము అప్రమత్తమవుతున్నామని వెల్లడించారు.
పటాన్‌చెరు సర్కిల్‌లో ప్రశాంతంగా పోలింగ్: సంగారెడ్డి ఎస్పీ - జీహెచ్‌ఎంసీ ఎన్నికలు తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 600మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎక్కడైనా ఘర్షణలు జరిగితే వెంటనే అప్రమత్తమై చెదరగొడుతున్నామని వివరించారు.
పటాన్ చెరు పరిధిలోని చైతన్య నగర్‌లో భాజపా-తెరాస వర్గాలు తోపులాటకు దిగాయి. భారతీ నగర్ పరిధిలోని తెరాస కార్యకర్తలు కారు గుర్తు ఉన్న పోల్ చిట్టీలు పంచుతున్నారని భాజపా అభ్యర్థి ఆరోపించారు. చిన్న చిన్న ఘర్షణలను వెంటనే చెదరగొడుతున్నామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. పోలింగ్ కేంద్రాలు తిరుగుతూ శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎన్నికలు జరుగుతున్న తీరుపై ఎస్పీతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి:శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఉపేక్షించేది లేదు: సీపీ