తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాలుష్యం బెడద నుంచి తప్పించండి' - ameenpur municipality people suffering with Pollution

అమీన్పూర్ పురపాలిక పరిధిలోని పలు కాలనీల్లో కాలుష్యం బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగ దట్టంగా చుట్టుకోవడం వల్ల భయాందోళన వ్యక్తం అవుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

sangareddy  district latest news
sangareddy district latest news

By

Published : May 20, 2020, 2:15 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పురపాలిక పరిధిలోని పలు కాలనీల్లో కాలుష్యం బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అమీన్పూర్ సెంతన్ హోమ్స్, నరేందర్ నగర్ కాలనీల్లో కాలుష్యపు వాసనలతో కూడిన దట్టమైన పొగతో మంగళవారం రాత్రి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఇంటి లోపల, బయట కాలుష్యం వాసనలతో తట్టుకోలేక పోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పీసీబీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కాలుష్యం బెడద నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details