సంగారెడ్డిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణం గణేశ్ నామస్మరణతో మార్మోగింది. డప్ప చప్పుళ్లు, తీన్మార్ స్టెప్పులు, కోలాటాలతో లంబోదరుడిని గంగమ్మ చెంతకు చేర్చారు. పాత బస్టాండ్ వద్ద చైతన్య యువజన సంఘం నెలకొల్పిన గణనాథుడి లడ్డూను స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూ. 8 లక్షల 50వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు. విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేసేందుకు వీలుగా పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్ చెరువులో సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
గణనాథుడి లడ్డూ రూ.8.50 లక్షలు... - ganesh
నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు. డప్పు చప్పుళ్లు, తీనామార్ స్టెప్పులతో విఘ్నేశ్వరుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. గణనాథుడి లడ్డూను ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూ. 8 లక్షల 50 వేలకు కైవసం చేసుకున్నారు.
వినాయక నిమజ్జనం