పత్తి మిల్లులో అగ్నిప్రమాదం... పెద్ద ఎత్తున నష్టం - పత్తి మిల్లులో అగ్నిప్రమాదం... పెద్దఎత్తున నష్టం
ప్రమాదవశాత్తు పత్తి మిల్లులో మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి కాలి బూడిదైంది. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అంత్వార్ శివారులో జరిగింది.

పత్తి మిల్లులో అగ్నిప్రమాదం... పెద్దఎత్తున నష్టం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అంత్వార్ శివారులోని పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన పత్తి నిల్వలు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. అప్పటికే పెద్ద మొత్తంలో పత్తి కాలిపోయింది. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు.
ఇవీచూడండి:మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు
TAGGED:
fire accident news