సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు చేస్తున్న సమ్మె మూడో రోజుకు చేరుకుంది. క్షేత్ర సహాయకులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. దశాబ్ద కాలంగా ఉపాధి హామీలో పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
మూడో రోజుకు చేరిన క్షేత్ర సహాయకుల సమ్మె - జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిరవధిక సమ్మెలో భాగంగా క్షేత్ర సహాయకులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు.
మూడో రోజుకు చేరిన క్షేత్ర సహాయకుల సమ్మె
కనీస వేతనం రూ.21 వేలు చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జాబ్ కార్డు ఆధారంగా కూలీలకు పని దినాలు కల్పించడంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా పాత విధానంలో వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఇదీ చూడండి:కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!