తెలంగాణ

telangana

ETV Bharat / state

కొడుకుపై కత్తితో దాడి చేసిన తండ్రి..!

మతిస్తిమితం కోల్పోయిన ఓ తండ్రి కొడుకుపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది.

కొడుకుపై చాకుతో దాడి చేసిన తండ్రి..!

By

Published : Aug 2, 2019, 6:50 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఆల్విన్ కాలనికి చెందిన రాంబాబు గత రెండు రోజులుగా మతిస్తిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నాడు. రాత్రి నిద్ర పోనివ్వకుండా కొడుకు పవన్ కుమార్​ను ఇబ్బందికి గురి చేశాడు. మధ్యాహ్నం చరవాణిలో వీడియో గేమ్ ఆడుకుంటున్న కొడుకుపై వెనుక నుంచి కత్తితో దాడి చేశాడు. మెడపై తీవ్రగాయాలయ్యాయి. అతన్ని హుటాహుటిన పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి రెండు రోజులుగా మతిస్తిమితం కోల్పోవడం వల్లనే ఇలా చేశాడని కుమారుడు చెబుతున్నాడు.

కొడుకుపై చాకుతో దాడి చేసిన తండ్రి..!

ABOUT THE AUTHOR

...view details