విద్యుత్ సరఫరాలో అంతరాయం తొలగించేందుకు ఓ కాంట్రాక్టు ఉద్యోగి ప్రాణాంతక సాహసం చేశాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు వీచాయి. ఈ గాలుల ఉద్ధృతికి ఓ చెట్టు కొమ్మ విరిగి విద్యుత్ తీగలపై పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ఔరా! నూర్: చెకచెకా ఎక్కి.. కరెంటు తీగలపై నడిచి..
సర్కస్లో తీగలపై నడుకుంటూ ఫీట్లు చేస్తుంటే ఔరా అంటూ ఆశ్చర్యపోయి చూస్తుంటాం.. కానీ కరెంటు తీగలపై ప్రాణాలకు తెగించి నడచిన వాళ్లను చూశామా..! అయితే సంగారెడ్డి జిల్లా నిజాంపూర్ గ్రామ విద్యుత్ ఉద్యోగి నూర్ చేసిన ఈ సాహసకృత్యం చూడండి.
చూట్టూ ఉన్న జనం భయాందోళనలో ఉండగా విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికుడుగా పనిచేస్తున్న నూర్ అనే యువకుడు ప్రాణాలకు తెగించి చెకచెకా స్తంభం ఎక్కి.. తీగలపై నడుచుకుంటూ వెళ్లి.. చిక్కుకున్న కొమ్మను తొలగించాడు. ఎటువంటి అపాయం లేకుండా నూర్ క్షేమంగా కిందకు దిగడం వల్ల విద్యుత్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎలాంటి రక్షణ, జాగ్రత్తలు లేకుండా కాంట్రాక్టు ఉద్యోగితో.. ఇంతటి ప్రమాదకరమైన పని చేయించడం వల్ల విద్యుత్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి:భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా