తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి - సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను అధికారులు పూర్తి చేశారు. తెరాస నేతల మద్దతుతో సభ్యుల ఎన్నిక ఏకపక్షంగా సాగింది.

నూతన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి
నూతన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి

By

Published : Jul 30, 2020, 3:27 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. నూతన సభ్యులుగా అంబాదాస్, లయక్, సాబేరాబేగం, యశోద ఎన్నికయ్యారు. ఏడుగురు తెరాస కౌన్సిలర్లు సహా ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ షారుఖ్ హుసేన్​ల మద్దతుతో ఎన్నిక ఏకపక్షంగా జరిగింది.

బహిష్కరించిన కాంగ్రెస్

కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించగా కోరం సరిపోవడంతో ఎన్నికల అధికారి ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులకు ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇవీ చూడండి : జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details