తెలంగాణ

telangana

ETV Bharat / state

వైకుంఠపురం ఆలయంలో ఏకాదశి ఉత్సవాలు - telangana latest news today

సంగారెడ్డిలో వైకుంఠపురం ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు ఆశీస్సులు తెలపడానికి దేవనాథ జీయర్ స్వామి హాజరై ఉత్తర ద్వార నీతిని వెల్లడించారు.

ekadasi-celebrations-in-vaikuntapuram-temple-sangareddy
వైకుంఠపురం ఆలయంలో ఏకాదశి ఉత్సవాలు

By

Published : Dec 25, 2020, 6:38 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైకుంఠపురం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని భక్తులకు ఆశీస్సులు తెలుపడానికి దేవనాథ జీయర్ స్వామి హాజరయ్యారు.

ఆలయంలోని ముఖ ద్వారంలో ఆలయ రాజ గోపురానికి ఆయన శిలాపూజ చేశారు. దేవుని ఆశీస్సులు భక్తులకు ఎల్లపుడూ ఉంటాయని జీయర్ స్వామి అన్నారు. ఉత్తర ద్వార ప్రవేశానికి సంబంధించిన నీతిని ఆయన భక్తులకు వివరించారు.

వైకుంఠపురం ఆలయంలో ఏకాదశి ఉత్సవాలు

ఇదీ చూడండి :భద్రాద్రి ముక్కోటి ఉత్సవాలపై భక్తుల అసంతృప్తి

ABOUT THE AUTHOR

...view details