సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సుమారు 15 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. జిల్లా కేంద్రంలోని గాంధీ కూడలిలో దారిన పోయే వారందరినీ పిచ్చి కుక్క తీవ్రంగా కరిచింది. ఒకేసారి ఎక్కువ మందిని కరవడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
పిచ్చి కుక్క దాడి... భయం గుప్పిట్లో పటాన్ చెరు - 13మందిపై పిచ్చి కుక్క దాడి... భయం గుప్పిట్లో పటాన్ చెరు
సంగారెడ్డిలో ఓ పిచ్చి కుక్క జనాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. 13మందిని తీవ్రంగా గాయపరిచిన శునకం... మళ్లీ ఎప్పుడు దాడి చేస్తుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
కుక్క ధాటికి భయాందోళనలో సంగారెడ్డి
గాయపడిన వారందరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుక్క మళ్లీ ఎక్కడ వస్తుందో తెలియని గుబులుతో కర్రలు పట్టుకుని ఉంటున్నామని స్థానికులు చెబుతున్నారు. గ్రేటర్ వెటర్నరీ విభాగం పిచ్చి కుక్కలను పట్టుకుని దూరంగా వదిలి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
'ఆ విభాగం తక్షణమే స్పందించాలి'