తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డి ఆస్పత్రిలో ఓపీ సేవల నిలుపుదల - వైద్యుల ఆందోళన

పశ్చిమ బంగాల్​లో వైద్యులపై దాడిని నిరసిస్తూ​ సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు ఒక రోజు ఓపీ సేవలను నిలిపేశారు. నల్లబ్యాడ్జీలు, గాయాలు అయినట్లు కట్లు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

వైద్యుల ఆందోళన

By

Published : Jun 17, 2019, 12:50 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యులు నల్ల బ్యాడ్జీలు, గాయాలు అయినట్లు కట్లు కట్టుకుని వినూత్న రీతిలో ఆందోళన చేప్టారు. పశ్చిమ బంగాలో వైద్యులపై చేసిన దాడిని నిరసిస్తూ ఓపీ సేవలు నిలిపివేశారు. దీనివల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని క్షమించాలని జుడాలు కోరారు. కోల్​కతాలో 85 ఏళ్ల వృద్ధుడు మరణిస్తే వైద్యులు కారణమని.. బంధువులు దాడి చేస్తే అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వైద్యుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైద్యుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details