దివ్యాంగుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దివ్యాంగులకు రెండు పడక గదుల్లో ఐదు శాతం కేటాయించాలని దివ్యాంగుల సంఘ నేత రవి కుమార్ డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తక్షణమే 2016 చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే 30 కేజీల బియ్యంతో కూడిన రేషన్ కార్డు ఇవ్వాలన్నారు.
'దివ్యాంగులకు రెండు పడక గదుల్లో 5 శాతం కేటాయించాలి' - 5 శాతం కేటాయించాలి
దివ్యాంగులకు రెండు పడక గదుల్లో 5 శాతం కేటాయించాలని డిమాండ్ చేస్తూ...సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తహసీల్దారు కార్యాలయం ఎదుట దివ్యాంగులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కారించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
divyang