సంగారెడ్డి పురపాలిక ఆవరణలో 300 మంది మునిసిపల్ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో కూరగాయలను పంపిణీ చేశారు. భౌతికదూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా మునిసిపల్ కార్మికులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని టీఎస్‌యూటీఎఫ్ నాయకులన్నారు. కరోనా కట్టడికి స్వీయ నియంత్రనే మార్గమని తెలిపారు. అత్యవసరమైతే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.
సంగారెడ్డిలో టీఎస్‌యూటీఎఫ్ కూరగాయల పంపిణీ - TSUTF Sangareddy Latest News
టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మునిసిపల్ కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు తెలిపారు.
సంగారెడ్డిలో టీఎస్‌యూటీఎఫ్ కూరగాయల పంపిణీ