సంగారెడ్డి పరిపాలన కార్యాలయం ముందు ఎమ్మెల్యే జగ్గారెడి.. కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో అన్నదాతలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీపై ఉలుకు పలుకు లేదన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతతో కర్షకులు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఆందోళన చేస్తున్న జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. స్థానిక పొలీస్ స్టేషన్కు తరలించారు.
రైతు రుణమాఫీ చేయాలి..జగ్గారెడ్డి ధర్నా.. - jagga reddy
ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా పరిపాలన కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు.
జగ్గారెడ్డి