తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో 10రోజులు ప్రజల సహకారం కావాలి: సీపీ సజ్జనార్ - తెలంగాణ వార్తలు

సైబరాబాద్​ కమిషనరేట్ పరిధిలోని చెక్​పోస్టులను సీపీ సజ్జనార్ సందర్శించారు. వాహన తనిఖీల విధానంపై ఆరా తీశారు. మరో 10 రోజులు లాక్​డౌన్​కు ప్రజలు సహకరించాలని కోరారు.

cyberabad cp sajjanar visits check posts, sajjanar about lock down
సైబరాబాద్ సీపీ సజ్జనార్, లాక్​డౌన్ అమలుపై సీపీ తనిఖీలు

By

Published : May 21, 2021, 1:10 PM IST

ప్రజల సహకారంతో లాక్​డౌన్ కొనసాగుతోందని... మరో 10 రోజులూ ఇదేవిధంగా సహకరించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్​డౌన్​ పరిస్థితులను ఆయన పరిశీలించారు. చెక్​పోస్టులను సందర్శించి వాహన తనిఖీలు నిర్వహించే తీరును అడిగి తెలుసుకున్నారు.

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 16 వేల కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. మినహాయింపు ఉన్న సమయంలోనే బయటకు రావాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.

ఇదీ చదవండి:కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు కోసం పోటెత్తిన జనం

ABOUT THE AUTHOR

...view details