సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు యువతీయువకులు భారీగా తరలివచ్చారు. 18 సంవత్సరాలు దాటిన వారందరికీ టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించడంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు పెద్ద ఎత్తున యువత ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రంలో నేడు రద్దీ ఎక్కువైంది.
Vaccination: వ్యాక్సినేషన్‌పై యువత ఆసక్తి.. కేంద్రాల వద్ద రద్దీ - covid vaccination in sangareddy district
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో టీకా కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సంగారెడ్డిలో టీకా కార్యక్రమం
వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెంట్లు, కుర్చీలను అందుబాటులో ఉంచారు. 40 సంవత్సరాలు దాటిన వారికి క్యూ లేకుండా టీకాలు వేసి పంపుతున్నారు. 40 వయసు లోపు మహిళలు, పురుషులకు విడివిడిగా క్యూ ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేస్తున్నారు.
ఇదీ చదవండి:Mallareddy: అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు బంధు : మల్లారెడ్డి