తెలంగాణ

telangana

ETV Bharat / state

'పురపాలక ఎన్నికల్లో బీసీలు, ముస్లింలకు సగం సీట్లు'

త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికలపై కాంగ్రెస్​ దృష్టి సారించింది. మున్సిపల్​ ఎన్నికలపై ఆదివారం సన్నాహక సదస్సు నిర్వహించారు. హైదరాబాద్​ మినహా 32 జిల్లాల నుంచి ముఖ్యనాయకులు సమావేశానికి హాజరయ్యారు. సదస్సులో పాల్గొన్న నేతలు ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పురపాలిక ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్​ చేశారు.

ఉత్తమ్​, భట్టి

By

Published : Jul 22, 2019, 6:00 AM IST

Updated : Jul 22, 2019, 7:29 AM IST

పురపాలక ఎన్నికలపై కాంగ్రెస్​ సన్నాహక సమావేశం

సంగారెడ్డిలో కాంగ్రెస్ పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యులు కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతికి సంతాపంగా మౌనం పాటించి సమావేశం ప్రారంభించారు. మూడు విడతలుగా జరిగిన సదస్సులో జిల్లాల వారీగా నాయకులతో చర్చించారు.

రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం

సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన కొత్త పురపాలక చట్టం రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. 73, 74 రాజ్యాంగ సవరణలను ఉల్లంఘించే విధంగా ఉందని ఆరోపించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన కౌన్సిలర్ల భవిష్యత్తు కలెక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా ఈ చట్టం చేస్తోందని విమర్శించారు.

బీసీ, ముస్లింలకు 50 శాతం టికెట్లు

కేసీఆర్​ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రమాదకరంగా మారాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలు, ముస్లింలకు తమ పార్టీ తరఫున 50 శాతం టికెట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ప్రతి అభ్యర్థి నుంచి స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ తీసుకుంటామని ఉత్తమ్​ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో ఈ నెల 27 నుంచి 30 వరకు కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహిస్తామన్నారు.

మంజీర సందర్శన

సమావేశం అనంతరం కాంగ్రెస్ ముఖ్యనాయకులు సంగారెడ్డి పట్టణ శివారులోని మంజీర డ్యాంను పరిశీలించారు. గోదావరి జలాలతో మంజీర నింపాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ఉజ్జయినీ బోనం... మురిసింది భాగ్యనగరం

Last Updated : Jul 22, 2019, 7:29 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details