సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భాజపా సభ్యత్వ నమోదులో భాగంగా నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలంగాణలో భాజపాకు వస్తోన్న ప్రజాదరణ చూసి తెరాస, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. భాజపాను లక్ష్యంగా చేసుకొని ఆ రెండు పార్టీలు విమర్శలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెరాస పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని.. రాహుల్ ఆధ్వర్యంలో ఆ పార్టీ చతికిలబడి పోయి, గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ సోనియా బాధ్యతలు చేపట్టారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ: లక్ష్మణ్ - లక్ష్మణ్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ: లక్ష్మణ్