సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని, సరిగాలేని మురుగునీటి వ్యవస్థను చూసి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటరీ ఇన్స్పెక్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మురుగునీటి వ్యవస్థ బాగుకోసం రూ. 5 లక్షలను కేటాయించనున్నారని తెలిపారు. కాలనీలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని.. మళ్లీ తానే వచ్చి స్వయంగా పరిశీలిస్తానన్నారు.
కాలనీల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కలెక్టర్ హనుమంతరావు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ