సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం నందిగామ గ్రామ పరిధిలో ఉన్న నారాయణ ఈకో టెక్నో పాఠశాలలో గత రాత్రి సమోసా చికెన్ తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందరికి వాంతులు కావడంతో... వసతి గృహం లోనే ఉంచి పాఠశాల యాజమాన్యం చికిత్స అందిస్తోంది. దాదాపు 20 మంది విద్యార్థుల వరకు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పాఠశాల యాజమాన్యం మాత్రం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
నారాయణలో కలుషిత ఆహారం.. విద్యార్థులకు అస్వస్థత.. - students
పాఠశాల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం నందిగామలో జరిగింది. స్థానిక నారాయణ పాఠశాలకు చెందిన సుమారు 20మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.
నారాయణలో కలుషిత ఆహారం.. విద్యార్థులకు అస్వస్థత..