రాష్ట్రవ్యాప్తంగా పురపాలిక పాలకవర్గాల గడువు జూలై 2తో ముగియనుంది. పురపాలక శాఖ ఓ అడుగు ముందుకు వేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్ల జాబితా సిద్ధ చేయాలని అధికారులను ఆదేశించింది. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేటలో కులగణన ప్రారంభమైంది. జూలై 4న పూర్తి అవుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. 6న ఓటర్ల జాబితా ప్రదర్శించనున్నట్లు స్పష్టం చేశారు. జూలై 7 నుంచి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించి, 18న తుది జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
మెదక్ పురపాలికల్లో కులగణన ప్రారంభం - caste census
మెదక్ జిల్లాలోని పురపాలికలల్లో కులగణన ప్రారంభమైంది. ప్రస్తుత పాలక వర్గం గడువు వచ్చే నెల 2తో ముగియనున్నందున కులాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక సంచాలకులు ఆదేశించారు.
మెదక్ పురపాలికల్లో కులగణన ప్రారంభం