సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఇసుక బావి వద్ద మురుగు కాలువలో మంగళవారం రాత్రి వ్యక్తితో సహా సహా కొట్టుకుపోయిన కారును ఎట్టకేలకు వెలికితీశారు. ఈ ఘటనలో గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఐదు రోజుల పాటు తీవ్రంగా గాలించారు. చివరకు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మత్స్యకారులు రెస్క్యూ బృందంగా ఏర్పడి గాలించగా కారు జాడ తెలిసింది.
ఐదురోజుల తర్వాత బయటపడిన కారు... కుళ్లిపోయిన మృతదేహం - ameenpur car updates
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వద్ద మురుగు కాలువలో కొట్టుకుపోయిన కారును అధికారులు ఎట్టకేలకు బయటికి తీశారు. ఐదు రోజుల పాటు గజఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించగా... కారు ఆచూకీ లభ్యమైంది. రెండు గంటల పాటు కష్టపడి కారును, అందులో ఉన్న వ్యక్తిని వెలికి తీశారు.
ఐదురోజుల తర్వాత బయటపడిన కారు... కుళ్లిపోయిన మృతదేహం
మురుగు కాలువ వంతెన నుంచి అర కిలోమీటర్ దూరంలో ఓ పక్కకు దిగబడి ఉన్న కారును మత్స్యకారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో హిటాచీ సాయంతో రెండు గంటలపాటు కష్టపడి కారును వెలికితీశారు. కారులోని ఆనంద్ మృతదేహం బాగా ఉబ్బిపోయి... తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. కారును చూసేందుకు పెద్ద ఎత్తున జనం ఘటనా స్థలంలో ఎగబడ్డారు. జనాలకు అదుపు చేయటం పోలీసులకు కష్టతరంగా మారింది.
ఇదీ చూడండి: గాలిపటం ఎగురవేస్తుండగా కరెంట్ షాక్... బాలుడి మృతి
Last Updated : Oct 18, 2020, 4:22 PM IST