సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూరు గ్రామ పరిధిలో ఉన్న ఎంఎస్ఎన్ పరిశ్రమలో కారు ఢీకొని ఓ కార్మికుడు చనిపోగా.. మరొకరు గాయపడ్డారు.ద్విచక్రవాహనంపై రోడ్డు పైకి వస్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఘటనలో సురేష్ అనే కార్మికుడు చనిపోగా గాయపడ్డ మరొకరిని ఆసుపత్రికి తరలించారు. కారులో ఐదుగురు యువకులు మద్యం తాగి అజాగ్రత్తగా నడుపుతూ వీరిని ఢీ కొట్టారని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. కార్మికులు కారులో ఉన్నవారిలో ఒకరిని పట్టుకోగా మిగతా నలుగురు యువకులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో కారు బైకు ఢీ ఒకరు మృతి - మృతి
మద్యం తాగి ఐదుగురు యువకులు అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో కారు బైకు ఢీ ఒకరు మృతి