సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లీ మండలం జాడి మల్కాపూర్‌లో రైతు బల్లెపు రాచన్నకు చెందిన ఎద్దు బుధవారం రాత్రి మృతి చెందింది. వ్యవసాయ సాగు పనుల్లో కన్నబిడ్డలా సేవలందించిన ఎద్దు మృతితో కుటుంబ సభ్యులు రాత్రంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. మనుషులకు నిర్వహించే అంత్యక్రియలకు ఏమాత్రం తీసిపోని విధంగా డప్పుల ఊరేగింపుతో అంతిమయాత్ర నిర్వహించారు. సుమారు పాతిక వేలు ఖర్చుపెట్టి ఎద్దుకు అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు.
ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించిన రైతన్న
కన్నబిడ్డలాంటి ఎద్దు చనిపోవడాన్ని ఆ రైతు జీర్ణించుకోలేకపోయాడు. తన కుటుంబ సభ్యులకు ఏవిధంగా అంతిమ సంస్కారాలు చేస్తారో అలాగే ఆ ఎద్దుకు అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు.
ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించిన రైతన్న