సంగారెడ్డిలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రక్త దాతలు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో ఆసుపత్రుల్లో రోగులకు రక్తం కొరత ఉన్నందున ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి పేర్కొన్నారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.
'సంగారెడ్డి కోర్టు ఆవరణలో రక్తదానం'
కరోనాను తరిమేందుకు రక్త దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా మరొకరి ప్రాణాలు కాపాడటం సులభం అవుతుందని తెలిపారు.
'రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రండి'
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, జిల్లా జైలు సూపరిండెంట్ నవాబ్ శివ కుమార్ గౌడ్ తదితరులు రక్తదానం చేశారు. అనంతరం రక్త దాతలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో గుర్తింపు సర్టిఫికెట్లను అందించారు.
ఇవీ చూడండి:'ఆ రంగంలో 29 లక్షల ఉద్యోగాలు పోతాయ్'
Last Updated : Apr 25, 2020, 12:18 PM IST