తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం

ప్రైవేటు టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ ఎదుట బీజేవైఎం కమిటీ ధర్నా నిర్వహించింది. ఆరు నెలలుగా జీతాలు లేక వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడింది. వారిని పట్టించుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

bjym dharna at sanagareddy collectorate
ప్రైవేటు టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం

By

Published : Oct 19, 2020, 1:34 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు జిల్లా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు ధర్నా నిర్వహించారు. కలక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని స్థానిక పోలీసు స్టేషన్​కు తరలించారు.

ప్రైవేటు టీచర్లకు ఆరు నెలలుగా జీతాలు లేవనీ, బతుకులు మారతాయని ఆశించిన ప్రజలకు తెరాస ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని బీజేవైఎం నాయకులు మండిపడ్డారు. ఆ ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారే కదా అని ప్రశ్నించారు. టీచర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, వారిని ఆదుకోవాలనీ, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:కరీంనగర్‌ కళకళ.. మానేరు డ్యాంలో అదరగొట్టిన లేజర్‌ షో

ABOUT THE AUTHOR

...view details