సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భాజపా ఆత్మగౌరవ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. తెరాస కుటుంబ, అవినీతి పాలనకు చరమ గీతం పాడటం భాజపాతోనే సాధ్యమని పేర్కొన్నారు. దక్షిణాదిలో కర్ణాటక తరహాలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం రోశయ్యను ఆనాడు కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రశ్నించి, ఈనాడు ఎందుకు జరపడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాలను కించపరుస్తున్నారని ఆరోపించారు.
'కుటుంబ పాలన నుంచి విముక్తి కోసమే మా పోరాటం' - ఆత్మగౌరవ సభ
కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం పోరాడే సమయం ఆసన్నమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
'కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం'