రైతుబంధు, రుణ మాఫీ వెంటనే అమలు చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు తహసీల్దార్ కార్యాలయంలో భాజపా ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు పధకం క్రింద ఏ ప్రాతిపదికన రైతుల ఖాతాలో జమ చేశారో, అదే విధంగా జమ చేయాలని భాజపా రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు.
'రైతుబంధు, రుణమాఫీ వెంటనే అమలు చేయాలి' - BJP Memorandum for Raithubandhu
తెరాస ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన రైతుబంధు, రైతు రుణమాఫీ పథకాలను వెంటనే అమలు చేయాలని పటన్‌చెరులో భాజపా నేతలు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందించారు.
రైతుబంధు, రుణమాఫీ అమలు చేయాలి
ప్రస్తుతం కొత్తగా అర్హులైన రైతులందరికీ గత రెండు సీజన్లతో పాటు ప్రస్తుత సీజన్‌తో కలిపి, ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన కోరారు. రైతులందరికీ లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన ఈ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా నేటికీ రుణమాఫీ చేయలేదని విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే రైతులకు రుణ మాఫీ, రైతు బంధు వెంటనే అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.