కేటీఆర్‌ను బర్తరఫ్ చేసే దాకా పోరాటం ఆగదు : బండి సంజయ్ Inauguration of Sangareddy district BJP office: రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్‌గా సంగారెడ్డితో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాల కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బీఆర్ఎస్పై ఘాటుగా స్పందించారు.
Bandi Sanjay on CM KCR: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో 30 లక్షల మంది ఇబ్బంది పడుతున్నా సీఎం కేసీఆర్ ఏ మాత్రం స్పందించ లేదని ఆరోపించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే.. కేటీఆర్‌ను బర్తరఫ్ చేయ్యాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను తొలగించి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం కోసం పని చేస్తుందని ఆరోపించారు.
పేపర్ లీకేజీకి బాధ్యులైన కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌ను బర్తరఫ్ చేసేదాక పోటారం చేస్తానని వెల్లడించారు. లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష పరిహారం ఇవ్వాలన్నారు. కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి... రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకోల్పుతామని బండి సంజయ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారింది కానీ.. తెలంగాణ మాత్రం మారలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. కవితపై ఈడీ విచారణతో తెలంగాణ పరువు పోయిందని నడ్డా ఆరోపించారు. త్వరలో కేసీఆర్‌కు ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారని నడ్డా స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఓబీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. కోర్టు క్షమాపణలు చెప్పమన్న చెప్పలేదన్నారు. అహంకారంతో ఉన్న రాహుల్‌కి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నడ్డా వివరించారు.
కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ వలన వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని సంజయ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని బండి డిమాండ్ చేశారు. నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: