సంగారెడ్డి పట్టణంలో అయ్యప్పస్వామి ఆభరణాలు ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. నవరత్న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కొత్త బస్టాండ్ నుంచి పట్టణ వీధుల గుండా అయ్యప్పస్వామి ఆలయం వరకు సాగింది. ఆభరణాల ఊరేగింపులో పాల్గొనేందుకు చుట్టూ పక్కల గ్రామాల నుంచి స్వాములు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అయ్యప్పస్వామి ఆభరణాల ఊరేగింపు - సంగారెడ్డిలో అయ్యప్ప ఆభరణాల ఊరేగింపు
శబరిమలలో మకర జ్యోతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో అయ్యప్పస్వామి ఆభరణాల ఊరేగింపు వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
అయ్యప్పస్వామి ఆభరణాల ఊరేగింపు
శబరిమలలో మకర జ్యోతి సందర్భంగా ఆభరణాలును ఊరేగిస్తారని.. అదే ఆనవాయితీని సంగారెడ్డి పట్టణంలో గత రెండు సంవత్సరాలుగా పాటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవంలో కారు జోరు..