తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆత్మ సౌజన్యంతో రైతులకు అవగాహన సదస్సు - సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం

సంగారెడ్డి వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో జీవ రసాయన ఎరువులు వాడకం తయారీ విధానంపై శాస్త్రవేత్తలు విజయలక్ష్మి, జహీరాబాద్ ఏడీఏ బిక్షపతి అవగాహన కల్పించారు. పలువులు రైతుల పొలాల్లో క్షేత్ర పరిశీలన నిర్వహించి దుంప కుళ్ళు వేరు కుళ్లు తెగుళ్లను పరిశీలించారు.

ఆత్మ సౌజన్యంతో రైతులకు అవగాహన సదస్సు
ఆత్మ సౌజన్యంతో రైతులకు అవగాహన సదస్సు

By

Published : Sep 3, 2020, 9:19 PM IST

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గొడిగార్​పల్లిలో ఆత్మ సౌజన్యంతో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అల్లం, ఆలు, చెరుకు పత్తి పంటలో జీవ రసాయనాల వాడకంతో పంటల్లో చీడపీడల నివారణ సులువని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. సంగారెడ్డి వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో శాస్త్రవేత్తలు విజయలక్ష్మీ, జహీరాబాద్ ఏడీఏ బిక్షపతి పంటల్లో జీవ రసాయన ఎరువులు వాడకం తయారీ విధానంపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు.

తెగుళ్ల పరిశీలిన...

పలువులు రైతుల పొలాల్లో క్షేత్ర పరిశీలన నిర్వహించి దుంప కుళ్ళు వేరు కుళ్లు తెగుళ్లను పరిశీలించారు. నివారణ చర్యల కోసం పిచికారి చేయాల్సిన మందుల వివరాలను రైతులకు వివరించి సూచనలు, సలహాలు అందించారు. అవగాహన సదస్సులో ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ప్రసవానంతరం ఈ మార్పులు సహజమే !

ABOUT THE AUTHOR

...view details